ఎలక్ట్రానిక్ పరికరాల సామర్ధ్యం మరింత పెరగనుంది
కొన్ని రకాలైన ఎలక్ట్రానిక్ పరికరాలను వజ్రాలతో తయారుచేస్తారు. ఇలాంటి వాటి సామర్ధ్యం మునుపటికంటే మరింత ఎక్కువగా పెరగనుంది. ఎందుకంటే పరిశోధకులు ఇలా వజ్రాలతో తయారుచేసే ట్రాన్సిస్టర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల సామర్ధ్యాన్ని మరింత పెంచే విధంగా కృత్రిమ వజ్రంలోకి చలన విద్యుత్తును ప్రవేశపెట్టేందుకు మెరుగైన పద్ధతిని రూపొందించారు. ఈ పద్ధతి ద్వారా వజ్రంతో తయారుచేసే ఎలక్ట్రానిక్ పరికరాలు మరింత సమర్ధవంతంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. గ్లాస్గో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కృత్రిమ వజ్రంలోకి చలన ఎలక్ట్రానిక్ విద్యుదావేశాన్ని ప్రవేశపెట్టేందుకు మెరుగైన పద్ధతిని కనుగొన్నారు. ఈ పద్ధతి ద్వారా వజ్రంతో తయారుచేసే ట్రాన్సిస్టర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాల పనితీరును, స్థిరత్వాన్ని మరింతగా పెంచేందుకు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
వజ్రాలు చాలా దృఢంగా ఉంటాయి. ఇవి రేడియోధార్మికతను, తీవ్రమైన వేడిని, చలి వంటి వాతావరణ పరిస్థితులను బాగా తట్టుకుంటాయి. ఈ కారణంగా ఉపగ్రహాలు, ఇతర అంతరిక్ష పరిశోధనలకు వజ్రాలు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్న పద్ధతిద్వారా అంతరిక్షంలో ఉపయోగించగల కొత్తరకం ఎలక్ట్రానిక్ వ్యవస్థల రూపకల్పనకు దారితీయనుంది. వజ్రాలతో విద్యుత్తు పరికరాలను తయారుచేయడానికి ఇరవయ్యవ శతాబ్దం నుండి ప్రయత్నిస్తున్నారు. వీటినుండి చాలా తేలికగా ఉష్టం ప్రవహిస్తుంది. వజ్రాలు అత్యధిక వోల్టేజీ విద్యుత్తును కూడా తట్టుకుంటాయి. అయితే వజ్రంలోకి చలన విద్యుదావేశాన్ని ప్రవేశపెట్టడం అనేది కష్టమైన పని. ఈ కారణంగా వజ్రాలతో తయారుచేసిన విద్యుత్ పరికరాలు వాణిజ్యపరంగా ఎక్కువగా వినియోగించుకునే స్థాయికి చేరలేదు.
ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉపరితల మార్పిడి డోపింగ్ అనే పద్ధతిద్వారా ఇలా వజ్రాలలోకి చలన విద్యుదావేశాన్ని ప్రవేశపెట్టగలిగారు. ఈ పద్ధతిలో ముందుగా గాలిలో ఉన్న అణువులను వజ్రం ఉపరితలంపై అంటుకునేలా చేస్తారు. ఈ అణువుల పొరకు ఎలక్ట్రాన్లను బదిలీ చేయడం వల్ల వజ్రంలో ఎలక్ట్రానిక్ ఖాళీలు ఏర్పడతాయి. వజ్రంలోనుండి విద్యుత్తు ప్రసారం కావడానికి ఈ రంధ్రాలు బాగా ఉపయోగపడతాయి. వేడి, తేమ వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగిన అణువును గుర్తించి, వాటిని వజ్రం ఉపరితలానికి అంటుకునేలా చేయగలిగామని పరిశోధకులు చెబుతున్నారు.